వర్ధన్నపేట/జనవరి19(జర్నలిస్ట్ వార్త):
స్నేహం మాటలకే కాదు… ఆచరణకూ అర్థమని మరోసారి నిరూపించారు బొక్కలగూడెం గ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రులు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బెల్లం సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు, కన్నీటి మధ్య ఓదార్పునిస్తూ కుటుంబానికి అండగా నిలిచారు.
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా మిత్రులంతా కలిసి రూ.15,000/-ల ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో చూపిన ఈ మానవత్వం గ్రామ ప్రజల హృదయాలను హత్తుకుంది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నిరంజన్‌తో పాటు దేవేందర్, సోమయ్య, రమేష్ చేరాలు, సంతోష్, కుమారస్వామి, రాములు, చంద్రయ్య, అరుణ, శ్రీలత, లక్ష్మీ, నరసమ్మ, చైనా బేగం, వెంకన్న, శ్రీను, పటాన్నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.