ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో జనవరి 19 (జర్నలిస్ట్ వార్త):
ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన దున్నపోతుల మోండయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన పార్థివ దేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖాన్ని పంచుకున్నారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చి, ఆర్థిక సహాయం అందజేశారు. మోండయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.