ప్రమాదంలో ప్రాణదాతగా మారిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి18(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన మారుముల్లా ఖన్నాయా–రేణుక దంపతుల కుమారుడు సిద్దు ఆదివారం సాయంత్రం వర్ధన్నపేట ఎస్సీ కమిటీ హాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు  కొండేటి శ్రీధర్  ప్రమాదాన్ని గమనించి వెంటనే తమ వాహనాన్ని నిలిపి గాయపడిన సిద్దును పరిశీలించారు. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న సిద్దును తక్షణమే తమ వాహనంలో ఎక్కించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అనంతరం సిద్దును వరంగల్‌లోని గార్డియన్ హాస్పిటల్‌కు తరలించి అడ్మిట్ చేయించి, హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే  మానవతా స్పందనకు స్థానికులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాడిపెల్లి రాజేశ్వర్ రావు, కొండేటి సత్యం, కొండేటి అజయ్, రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.