ఇల్లందలో స్వచ్ఛతకు శ్రీకారం సర్పంచ్ సాంబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి19(జర్నలిస్ట్ వార్త):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ బేతి సాంబయ్య ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు, అధికార యంత్రాంగం కలిసి ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ స్వయంగా పాల్గొని గ్రామంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటి చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని గ్రామస్తులకు సూచించారు.
 ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, ఓపెన్ డిఫికేషన్ పూర్తిగా నిలిపివేయాలని అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భ జలాల అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, శుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించుకోవచ్చని సర్పంచ్ బేతి సాంబయ్య అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామస్తులంతా భాగస్వాములై సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.