చిల్పూర్ /జనవరి19(జర్నలిస్ట్ వార్త):
జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ గ్రామ బూత్ అధ్యక్షులు దోరం శ్రీనివాస్ (04-01-2026న అనారోగ్యంతో మృతి) కుటుంబానికి బీజేపీ అండగా నిలిచింది.
పార్టీ చేపట్టిన ఫండ్ కలెక్షన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు (వెంకన్న) తమ వంతు సహాయంగా రూ.5,000లను మృతుని కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్త కుటుంబానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, కష్టకాలంలో వారికి సహకారం అందించడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.