రాయపర్తి/జనవరి 25(జర్నలిస్ట్ వార్త);
మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీ మెంబరుగా మండల కేంద్రానికి చెందిన గారె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు, కోశాధికారి చిలంచర్ల సతీష్ ఈసీ మెంబరుగా ఎన్నికైన గణేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. రైస్ మిల్లులు అంటే యంత్రాల సమూహం కాదని రైతన్న కష్టాని ఫలాలుగా మార్చే సంపద బాండాగరాలని తెలిపారు. కర్షకులు కళ్ళల్లో ఆనందం నింపడానికి రైస్ మిల్లర్లు తాపత్రయపడుతుంటారని వ్యాఖ్యానించారు. నాపై నమ్మకంతో జిల్లా ఈసీ మెంబరుగా ఎన్నుకున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ అసోసియేషన్ బరోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి మండల కేంద్రానికి చెందిన పలువురు అతనికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.