బయ్యారం మండల వ్యవసాయ కార్యాలయం రైతు వేదికలోకి మార్పు.

journalist vaartha
By -
బయ్యారం/జనవరి 25(జర్నలిస్ట్ వార్త);
 మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు ఎదురుగా ఉన్న మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల, పాత కార్యాలయాన్ని రికార్డులను భద్ర పరచుటకు ఉపయోగించనున్నామని,
ప్రస్తుత మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని రైతు వేదికలోకి మార్చడం జరిగిందని వ్యవసాయ అధికారి కే. రాజు ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు.కొత్త ప్రాంగణంలో సిబ్బంది, రైతులకు కూర్చునే విధంగా అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని,ఇకపై వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సేవలు బయ్యారం మండల కేంద్రంలో ఎస్ సి కాలనిలో రైతు వేదిక నుండి సేవలు అందించబడతాయని తెలిపారు. రైతులు ఈ మార్పును గమనించి వ్యవసాయ సేవల కోసం రైతు వేదిక ను సంప్రదించాలన్నారు.
ఈ మార్పు జనవరి 26,2026 నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు.