బయ్యారం/జనవరి25(జర్నలిస్ట్ వార్త);
మండలంలో కొత్తపేట పంచాయతీ లో సింగారం -2 ఎస్సీ కాలనీలో ఆదివారం సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ 30 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నూతన రోడ్లకు శంకుస్థాపన చేశారు.అనంతరం సర్పంచ్ భూక్యా ప్రవీణ్ మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంజూరు చేయించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల 30 లక్షల నిధులతో 5 సిసి రోడ్లు, ఒక కాల్వర్ట్ కు గ్రామ ప్రజలు, పాలకవర్గం సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కనకయ్యకు,ఎంపీ బలరాం నాయక్ కి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఇవే కాకుండా ఎమ్మెల్యే సహకారంతో సింగారం-2 కాలనీకి కమ్యూనిటీ హాల్ ని మంజూరు చేయిస్తానని,గ్రామానికి ఎలాంటి నిధులు వచ్చిన ముందుగా ఎస్సీ కాలనీలకు ప్రాముఖ్యత ఇస్తామని, దశల వారిగా గ్రామంలో ఉన్న ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని,గ్రామ అభివృద్ధికి వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్యా శ్రీను,బుజ్జి,పుల్లూరి బాలరాజు,మాతంగి ఉపేందర్,ప్రశాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.