రజక సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ…రజకుల హక్కుల సాధనకు ప్రభుత్వం సహకరించాలి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శ ఆరేళ్లి ప్రభాకర్

journalist vaartha
By -

వర్ధన్నపేట / జనవరి 25 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో రజక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రజక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేళ్లి ప్రభాకర్ మాట్లాడుతూ, రజకుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని డిమాండ్ చేశారు. రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, తద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా రజకులు వెనుకబాటుకు గురవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు అమలు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేందర్, యాకయ్య, సమ్మయ్య, బిక్షపతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.