వర్ధన్నపేట/జనవరి 21 (జర్నలిస్ట్ వార్త);
జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారద ఆదేశాల ప్రకారం బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పూర్తి కార్యక్రమం నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాయిత శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల విద్యతో పాటు క్రీడలు, కలలు, సాంస్కృతిక కార్యకలాపాల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలి అని సూచించారు. తోటి విద్యార్థులతో సహోదర భావాన్ని పెంపొందించి, వారి జీవితాన్ని ఒక అందమైన పుస్తకంగా తీర్చిదిద్దుకోవాలని సూచన తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాయిత శ్రీనివాస్, విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో నేర్చుకునే వినయం, క్రమశీలతలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల జాతీయ క్రీడా సంస్థ అధికారి నిమ్మ మనుజేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు కుసుమ కుమార స్వామి, లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.