అత్తింట్లో అల్లుడు దొంగతనం.చేదించిన పోలీసులు కేసు నమోదు. సిఐ రవీందర్

journalist vaartha
By -

 బయ్యారం/జనవరి 21(జర్నలిస్ట్ వార్త); మండలంలోని సంతులాలపోడు గ్రామపంచాయతీ పరిధిలో గోలి కలమ్మ ఇంట్లో ఈనెల 15న దొంగతనం చేసి ఒకటిన్నర తులాల బంగారం పోవడంతో బాధితురాలు బయ్యారం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి, కేసు నమోదు చేసినట్లు రవీందర్ తెలిపారు. తిరుపతి దర్యాప్తులో భాగంగా కేసును చేదించి అత్తింట్లో అల్లుడు కారేపల్లి గ్రామానికి చెందిన దారా రాంబాబు దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి బుదవారం రిమాండ్ పరిచినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.