యునాని వైద్యశాల పరిశీలించిన సర్పంచ్.-శాంతి కిషన్ నాయక్

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 21జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మేజర్ గ్రామపంచాయతి పరిధిలోని ప్రభుత్వ యునాని వైద్యాశాలను సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ బుధవారం పరిశీలించారు..ఈ సందర్బంగా ఆసుపత్రికి సంబందించిన సమస్యల గురించి డాక్టర్ శంకర్ ని అడిగి తెలుసుకున్నారు..డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ఆసుపత్రికి సంబందించి వర్షా కాలంలో స్లాబ్ కురుస్తుందని,అలాగే ఫర్నిచర్,నీళ్ల సమస్య ఉందని సర్పంచ్ కి తెలియజేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ దంపతులను డాక్టర్ శంకర్ శాలువాతో సత్కారించారు.ఈ కార్యక్రమం ఆసుపత్రి సిబ్బంది,పులి మల్లయ్య,అశోక్,మోహన్ కుమార్,దేవేంద్ర,యోగా శిక్షకులు పావని,ప్రసాద్.
తదితరులు పాల్గొన్నారు.