,బయ్యారం/జనవరి21(జర్నలిస్ట్ వార్త);,
ప్రపంచంలో మానవ మనుగడ ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉంటుంది సనాతన ధర్మం నమ్ముకుని అర్చకులు, విరామం లేని సేవ చేస్తూ వారి బ్రతుకు జీవన పోరాటం సాగిస్తున్నారని అనంతాద్రి దేవాలయ అర్చకులు విశ్వహిందూ పరిషత్తు బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు విజయచార్యులు బుధవారం అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు సామజిక ఫెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్చకత్వం అంటే ఉద్యోగం లేకుండా విరామం లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేసే భావన మాత్రమే తీసుకొని జీవన సాగిస్తున్న దుర్భర జీవితం గడుస్తున్న అర్చకులు అనేక బాధలలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తిథి నక్షత్రాల ఆధారంగా మంచి చెడును చూసి నలుగురికి మంచిపంచే కార్యక్రమమని అన్నారు.పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు శుభకార్యాలు వచ్చిన అర్చకులు లేనిదే ఆ కార్యక్రమం ముందుకు సాగదు సనాతనములో అర్చకులు చాలా వైభవంగా ఉండేవారని నేటి సమాజంలో అర్చకులను మనోవేదన బ్రతుకుతున్నారని విశ్వహిందూ పరిషత్తు బ్రాహ్మణ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శనచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు.తెల్లవారుజాము నుండి దేవాలయాలలో దేవుడికి పూజలు, భక్తులకు దీవెనలు ఇస్తూ ఉన్నా మా సమస్యలను పట్టించుకోవడం లేదని,మూడాల,ముహుర్తాలు లేని సమయంలో అర్చకులను మందలించే వారుండరని,మిగతా సమయంలో భక్తుల కానుకల మీదే ఆదారపడుతున్నామని తెలిపారు.ప్రభుత్వం అర్చకులను గుర్తించి నెల వారి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.