వర్ధన్నపేటలో ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపనప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి21 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్‌కు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ముఖ్యంగా యువత శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యమే అసలైన సంపదని, దాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా మారాలని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా వ్యాయామ సదుపాయాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పురపాలక అధికారులు పాల్గొన్నారు.