శాస్త్రీయ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలబ్ధిదారులకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

journalist vaartha
By -
వర్ధన్నపేట,/జనవరి 21 (జర్నలిస్ట్ వార్త);
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యమైన ప్రమాణాలతో, శాస్త్రీయ పద్ధతిలో జరగాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ స్వయంగా నిర్మించుకోలేని పేద లబ్ధిదారులను గుర్తించి, కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బుధవారం మండల కేంద్రంలోని మండల గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పునాది నుండి ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు. తక్కువ స్థలంలో కూడా గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చేలా ఉత్తమ గృహ నమూనాలను ప్రదర్శించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వం అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేయకుండా, దశలవారీగా పనులు పూర్తి చేస్తూ ప్రతి పేద కుటుంబానికి పటిష్టమైన, దీర్ఘకాలిక సొంతింటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. నాణ్యమైన సామగ్రితో ఇళ్ల నిర్మాణం చేపట్టి భవిష్యత్ తరాలకు భద్రమైన నివాసాలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.