వేలేరు/జనవరి 21(జర్నలిస్ట్ వార్త);
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ గ్రామస్థాయి క్రీడల రెండో ఎడిషన్ వేలేరు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి—వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు సర్పంచ్, సీఎం కప్ నిర్వహణ కమిటీ చైర్మన్—మరియు మండల విద్యాశాఖ అధికారి చంద్రమౌళి గారు హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి , గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం కప్‌ను రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పోటీలు గ్రామీణ యువతకు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే అరుదైన అవకాశమని, క్రీడాకారులు దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేలేరు ఉపసర్పంచ్ శ్రీకర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం, సీఎం కప్ నిర్వహణ కమిటీ కన్వీనర్, జీపీ కార్యదర్శి రవికుమార్, వార్డు సభ్యుడు సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘం నాయకులు అనిల్, శ్రీకాంత్, రాకేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.