కాకతీయ యూనివర్సిటీలో నేతాజీ జయంతి సన్నాహక సమావేశం

journalist vaartha
By -

వరంగల్/జనవరి 21 (జర్నలిస్ట్ వార్త);
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ దివాస్‌లో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో తొలిసారిగా ఉపన్యాస పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు జనవరి 23న ఉదయం 10 గంటలకు సెనేట్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్ ఆధ్వర్యంలో జరిగింది.కాకతీయ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్స్ డీన్ ఎఫైర్స్, రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తంగా ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నాయి. సమావేశానికి ముఖ్య అతిథిగా స్టూడెంట్ యూత్ ఆఫీసర్ డాక్టర్ బి. నిరంజన్ హాజరై మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను యువతకు సమగ్రంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.యూనివర్సిటీ విద్యార్థులు నేతాజీ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణయ్యతో పాటు అధ్యాపకులు డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, డాక్టర్ వాడపల్లి నాగరాజు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పోటీల నిర్వహణ కోసం రాజనీతి శాస్త్ర విద్యార్థులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కోఆర్డినేటర్‌గా రుబీనా (రిసెర్చ్ స్కాలర్), కన్వీనర్లుగా జి. టీన, బి. దేవేందర్‌లను నియమించారు. కో-కన్వీనర్లుగా వై. కావ్య, కె. సాయికృష్ణ, ఎం.డి. సామ్రిన్ ఖాన్, ఎన్. శ్రీరంజన, వి. రాజ్యలక్ష్మి, కె. వివేక్‌లను ఎంపిక చేశారు. మెంబెర్స్‌గా శ్రీచందన, అనూష, అన్వేష్, మేరీ సుగంధలను నియమించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం నూతన కమిటీ సభ్యులను అభినందించింది.