నల్లబెల్లిలో ప్రజాబాట. విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఏఈ తరుణ్

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి20(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో మంగళవారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఏఈ (ఏబీ) బీ.తరుణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు ఎలా జరుగుతాయో, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న బ్రోకెన్ పోల్స్, మిడిల్ పోల్స్, వదులుగా ఉన్న విద్యుత్ వైర్లు తదితర ప్రమాదకర పరిస్థితులను గుర్తించి, అవి ప్రజలకు ప్రమాదంగా మారకుండా తక్షణమే సరిచేస్తామని తెలిపారు.ప్రజలు విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, పూర్వ ప్రముఖులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఫోర్‌మన్ ఎల్.రమణారెడ్డి, లైన్మెన్లు డి.లక్ష్మణ్, కె.ఐలయ్య, జేఎల్ఎం ఎం.ప్రవీణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.