ముల్కనూర్ సమ్మక్క–సారలమ్మ జాతరలో వైద్య సేవలు

journalist vaartha
By -

భీమదేవరపల్లి/జనవరి29 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు విచ్చేసిన భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రథమ చికిత్స వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అత్యవసర మందులు, టిటి ఇంజెక్షన్లు, ఏఆర్వీ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 108 అంబులెన్స్ వాహనాన్ని కూడా శిబిరం వద్ద ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో వైద్య సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, డా. జ్యోత్స్న, డా. రహ్మాన్‌లతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు విధుల్లో పాల్గొని భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు.