రాయపర్తి/జనవరి 24(జర్నలిస్ట్ వార్త):అదుపు తప్పి తౌడు లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల నుండి ఏలూరు కు తౌడు లోడ్ తో వెళ్తున్న లారీ శనివారం తెల్లారుజామున మండల కేంద్రంలోని వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్,క్లీనర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అదుపు తప్పి బోల్తా పడిన లారీ
By -
January 24, 2026