ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి నేత బిర్రు మహేందర్ మాదిగ తండ్రి యాకయ్య మృతి

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి 24
 (జర్నలిస్ట్ వార్త):
ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ 
తండ్రి బిర్రు యాకయ్య అనారోగ్యంతో మృతి చెందారు.వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి మండలానికి చెందిన బిర్రు యాకయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషాద వార్త తెలియగానే ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి నేతలు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంతాపం వ్యక్తం చేశారు. మహేందర్ మాదిగ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, యాకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మృతుని అంత్యక్రియలు స్వగ్రామమైన నల్లబెల్లి మండలంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నట్లు సమాచారం.