బయ్యారం/జనవరి23(జర్నలిస్ట్ వార్త);
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై నామాలపాడు వార్డు సభ్యులు బీజేపిలో చేరారు.
బయ్యారం మండలం నామాలపాడు గ్రామపంచాయతికి చెందిన 5వ వార్డు సభ్యులు చీమల కృష్ణ శుక్రవారం బీజేపీ మండల కార్యదర్శులు తుమ్మల శ్రీనివాస్,ఊకె రామ్మూర్తి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.వీరికి ఊకె రామ్మూర్తి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపు జై,దాసరి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.