జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రజలను చైతన్యపరచాలి.-తహశీల్దార్ నాగరాజు.

journalist vaartha
By -
బయ్యారం/జనవరి 23(జర్నలిస్ట్ వార్త);
 మండల కేంద్రంలోని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల తహశీల్దార్ కార్యాలయంలో,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను మండల తహశీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులతో చేపించారు.ఈ సందర్బంగా తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ నా దేశం - నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవేంద్ర చారి,ఆర్ఐలు సందీప్,ఉపేందర్,బిఎల్ఓ లు,జిపిఓ లు,కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక బృందం,విద్యారిని విద్యార్థులు,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.