మచ్చలేని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుపై నిందలు వేస్తే ఖబర్దార్ టీఆర్ఎస్ హెచ్చరిక

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి23(జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఇంచార్జ్ చింతల యాదగిరి, పోలపల్లి రామ్మూర్తి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తుళ్ల కుమారస్వామి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌రావు  మచ్చలేని నాయకుడని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మూడు పర్యాయాలు, పాలకుర్తిలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజలకు సేవలందించిన నాయకుడు దయాకర్‌రావు ని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్రాన్ని దేశంలోనే ముందువరుసలో నిలిపారని, అనేక జాతీయ అవార్డులు సాధించారని పేర్కొన్నారు.
అన్న అంటే నేనున్నా అన్నట్టుగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి దయాకర్‌రావున్నారు. వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలను అభివృద్ధిలో ముందుంచిన నాయకుడు ఆయనేనని చెప్పారు. 24×7 ప్రజల కోసం అందుబాటులో ఉండే నాయకుడని కొనియాడారు.
కనీస అర్హత లేని వ్యక్తులు దయాకర్‌రావు ని విమర్శించే స్థాయిలో లేరని, 70 ఏళ్ల వయస్సులోనూ పాలకుర్తి, వర్ధన్నపేట ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. అలాంటి నాయకుడిపై అనవసర ఆరోపణలు చేస్తే వర్ధన్నపేటలో కార్యకర్తలే కాదు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్గం బిక్షపతి, అన్నమనేని అప్పారావు, గుజ్జా గోపాలరావు, తుమ్మల యాకయ్య, సిల్వర్ కుమార్ స్వామి, బుక్య భిక్షపతి, కొండేటి శ్రీనివాస్, పూజారి రఘు, మర్త సారంగపాణి, కంజర్ల రవీందర్, వేణుగోపాల్ రావు, పిట్టల రాజు, భూక్య రామన్న, భానోతు శ్రీను, జన్ను రాములు, కొండేటి సుధాకర్, కంజర్ల మహేష్, పులి సత్యనారాయణ, ఎండి అజీమ్, సిల్వర్ రాజు, వేరేష్ మో తదితరులు పాల్గొన్నారు.