కల్లుగీత కార్మిక సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి20(జర్నలిస్ట్ వార్త): కల్లు గీత కార్మిక సంఘం వర్ధన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కల్లుగీతా కార్మిక సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో కల్లుగీతా కార్మిక సంఘం వర్ధన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేజీకేఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షులు పులి సోమయ్య గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూర్యయ్య గౌడ్, పర్వతగిరి మండల అధ్యక్షులు సతీష్ గౌడ్, రాయపర్తి మండల అధ్యక్షులు సంపత్ గౌడ్ హాజరై ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్ధన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వీరస్వామి గౌడ్,జిల్లా గౌరవ సలహాదారులు, వర్ధన్నపేట మండల ప్రధాన కార్యదర్శి సట్ల సూర్యయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కల్లుగీత‌ కార్మికులకు రూ.4 వేలు పింఛన్, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 
 వర్ధన్నపేట మండల అధ్యక్షులు జనగాం యాకయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి సట్ల సూర్య గౌడ్,గౌరవ అధ్యక్షులు సుదగాని లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు మెరుగు రాజయ్య గౌడ్, మండల సహాయ కార్యదర్శిలు బుర్ర అశోక్ గౌడ్, మడత ప్రశాంత్ గౌడ్, కార్యవర్గ సభ్యులు మడ్డి సుధాకర్ గౌడ్, బూర సంపత్ గౌడ్, సట్ల వెంకటరావు నరసయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.