వర్ధన్నపేట/జనవరి26(జర్నలిస్ట్ వార్త):
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం కమిషనర్ పతాక వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మనకంటూ ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను, విస్మరించకుండా ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, స్వచ్ఛ వర్ధన్నపేటగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ కుమార్ కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి, పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, వార్డు అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు