ఐనవోలు/జనవరి30(జర్నలిస్ట్ వార్త);
హనుమకొండ జిల్లాలో ఎరువుల విక్రయాలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. రేపటి నుండి (జనవరి 31) జిల్లావ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు కేవలం ప్రభుత్వ అధికారిక యాప్ ద్వారానే నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఐనవోలు సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి సంపత్ కీలక సూచనలు చేశారు. ఎరువుల విక్రేతలు, సహకార సంఘాల నిర్వాహకులు వెంటనే సంబంధిత యాప్‌ను తమ చరవాణిలో పొందుపరుచుకుని, వారి వ్యక్తిగత గుర్తింపు సంఖ్యతో లాగిన్ కావాల్సి ఉంటుంది. నేటి, నాటికి నిల్వ ఉన్న ఎరువుల వివరాలను మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో యాప్‌లో నమోదు చేయడం తప్పనిసరి. రేపటి నుండి జరిగే ప్రతి విక్రయం ఈ యాప్ ద్వారానే సాగాలి. నిబంధనలు అతిక్రమించి ఇతర మార్గాల్లో విక్రయాలు జరిపితే డీలర్ల అనుమతి పత్రాలను తక్షణమే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. రైతులు, వ్యాపారులు ఈ నూతన మార్పుకు సహకరించాలని కోరారు.