కట్రియాల గ్రామ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా చేవెళ్ల సమత ఎన్నిక

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి1(జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మండలంలోని కట్రియాల గ్రామ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా చేవెళ్ల సమత నియమితులయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆమోదంతో సమత నియామక పత్రాన్ని మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుకు, పార్టీ నాయకులకు సమత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని తనకు మద్దతు తెలిపిన నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.పార్టీ బలోపేతానికి, గ్రామ మహిళా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా చేవెళ్ల సమత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 
 కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,
 మార్కెట్ చైర్మన్ నరుకుడ వెంకటయ్య,
 బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజ్ రెడ్డి,
 టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,
 మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎం.డి. చోటే,
బ్లాక్ మహిళా అధ్యక్షురాలు తీగల సునీత గౌడ్ 
 మైనార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి. అక్బర్
 గ్రామ ఉప సర్పంచ్ నాంపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
.