బైరి గణేష్ చందర్ ముదిరాజ్ మృతి – నివాళులు అర్పించిన మెపా తెలంగాణ

journalist vaartha
By -

ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో ఫిబ్రవరి 1 (జర్నలిస్ట్ వార్త);హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, ఉనికిచర్ల గ్రామానికి చెందిన బైరి గణేష్ చందర్ ముదిరాజ్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ – తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ లు మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మృతుడి కుమారులు రాజేష్ ఖన్నా, రాకేష్, కుమార్తె రాణి ముదిరాజ్ లను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, జాతి బిడ్డలకు మెపా ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ ఖన్నా సేవలను ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం ముదిరాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి రాజేష్, రాష్ట్ర నాయకులు బైరి సోమయ్య, పుట్ట మహేందర్, మట్టపల్లి రామ్ కోటి, మట్టపల్లి సాంబయ్య, సురేష్, రమేష్, శంకర్, నటరాజ్, కోటి, సదానందం ముదిరాజ్ లతో పాటు ఉనికిచర్ల గ్రామ ముదిరాజ్ పెద్దలు, బంధువులు పాల్గొన్నారు