ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో ఫిబ్రవరి 1 (జర్నలిస్ట్ వార్త);
సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో ముందుండాలని ఎన్.ఎస్.ఎస్ (కాకతీయ యూనివర్సిటీ) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో–ఎడ్యుకేషన్), హనుమకొండలో నిర్వహించిన ఎన్.ఎస్.ఎస్ శీతకాల ప్రత్యేక శిబిరం ఏడవ రోజు ముగింపు సమావేశం కళాశాల ప్రిన్సిపల్ ఆర్. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఎన్.ఎస్.ఎస్ శిబిరాల ద్వారా విద్యార్థులు గ్రామాల్లోని జీవన పరిస్థితులు, పరిసర వాతావరణ సమస్యలను అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మూఢనమ్మకాల నిర్మూలన, నిరక్షరాస్యత నివారణ, ఎయిడ్స్‌పై అవగాహన, స్వచ్ఛత వంటి అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సమాజంలో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ నరిశెట్టి సుధాకర్ మాట్లాడుతూ, గ్రామానికి సేవ చేయడానికి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు రావడం తమకు గర్వకారణమన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు.ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎస్. ధర్మేంద్ర మాట్లాడుతూ, విద్యార్థులు గ్రామాల్లో సేవ చేయడం, సామాజిక సర్వేలు నిర్వహించడం ద్వారా సమాజంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.ఎన్.ఎస్.ఎస్ కే.యూ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ఆర్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు రక్తదానంలో ముందుండాలని, రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడినట్లేనని అన్నారు.ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. రాజ్ కుమార్, అధ్యాపకులు కే. శ్రీదేవి, జ్యోతిర్మయి, శోభ, రేవతి, సువర్ణ, అరుణ్ ప్రభాత్, రాజేంద్రప్రసాద్, విజయ్ చందర్, భవాని సాగర్, రమేష్, రాజేందర్‌తో పాటు వార్డు సభ్యులు మాదాసి కుమార్, బేర కోటి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.