బయ్యారం/ఫిబ్రవరి 1( జర్నలిస్ట్ వార్త);
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నా నేపథ్యంలో, మండల వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాత గణేష్ ఆందోళనలకు పిలుపునిచ్చారు.
రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ట్యాపింగ్ పేరుతో కట్టుకథలు సృష్టించి,సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ మండల నాయకురాలు కల్పన సునీల్ నాయక్ అన్నారు..నిరసనల్లో భాగంగా మండలంలో పలు గ్రామపంచాయతీల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించారు.
మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్బంగా కల్పన సునీల్ నాయక్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని,కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ విచారణ అని కల్పన సునీల్ నాయక్ మండిపడ్డారు.ఈ నీరసనల్లో రచ్చ చంద్రమౌళి,నీలారపు సంపత్ యాదవ్,కీర్తి ఉదయ్,కంబాల లెనిన్,దావ శ్రీకాంత్, శోభన్, చందా సందీప్,రేఖ యాకయ్య,జెర్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.