అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైన బయ్యా నవీన్‌ కు ఎమ్మెల్యే సన్మానం.

journalist vaartha
By -
బయ్యారం/ఫిబ్రవరి1(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బాల్ బ్యాడ్మింటన్ యువ క్రీడాకారుడు బయ్యా నవీన్ ఇండోనేషియా దేశం బాలిలో ఈ నెల 13 నుండి 19 వరకు జరగనున్న అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు.ఈ సందర్బంగా ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నవీన్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్ 2025–26కు భారత జట్టులో బయ్యా నవీన్ ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ బయ్యా నవీన్ సాధించిన ఈ విజయం రాష్ట్ర యువతకు ఆదర్శమని,కష్టపడి సాధన చేస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించవచ్చని ఆయన నిరూపించారని ప్రశంసించారు. రాబోయే బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇండోనేషియా వెళ్లడానికి తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు.
బయ్యా నవీన్ మాట్లాడుతూ తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు,క్రీడా సంఘాల ప్రతినిధులకు, ఎమ్మెల్యే కు,మూల మధుకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, బయ్యారం సోసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్,తాడబోయిన ప్రభాకర్ యాదవ్ ఉన్నారు.