బయ్యారం/ఫిబ్రవరి1( జర్ణలిస్ట్ వార్త);
మండల కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమ్మగాని ప్రమోద్ కుమార్ ఔషధ మొక్కల సమగ్ర సమాచారంతో రచించిన హీలింగ్ రూట్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం వారు తెలిపారు.ప్రకృతి వైద్య రంగంలో విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ పుస్తకాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల అగ్ర నాయకత్వం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య చేతులమీదుగా పుస్తకావిష్కరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనల పట్ల మన భారతీయ మూలికా సంపద పట్ల విద్యాసంస్థకు ఉన్న అంకితభావానికి ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని, తరగతి గదులకు పరిమితం కాకుండా, పరిశోధనలను,విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో శ్రీ చైతన్య కుటుంబం చూపుతున్న నిరంతర మద్దతుకు నిదర్శనమని ఆయన అన్నారు.ప్రస్తుత సొసైటీ లో ఔషధ మొక్కలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని,ఇటువంటి గొప్ప పుస్తకాన్ని రచించిన ప్రమోద్ కుమార్ ను చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, సంస్ధ ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రతినిధులైన వర్మ,బ్రహ్మం,ప్రకాష్,గోపాలకృష్ణ,రత్నాకర్, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.