ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా.18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పొన్న రవి

journalist vaartha
By -
స్టేషన్ ఘన్ పూర్/ఫిబ్రవరి1(జర్నలిస్ట్ వార్త) : 
ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు ను అన్నివిధాల అభి వృద్ధి చేసి చూపిస్తానని 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పొన్న రవి కోరారు.కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం పొన్న రవి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేస్తూ, ప్రజాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు వార్డులోని ప్రతి ఇంటికి అందే లా కృషి చేస్తానన్నారు. వార్డులోని ప్రజలందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్, రమేష్, బిక్షపతి, శ్రీనివాస్, ప్రభాకర్ తదితర కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.