స్టేషన్ ఘన్ పూర్/ ఫిబ్రవరి1( జర్నలిస్ట్ వార్త) : ఆశీర్వదించండి అభివృద్ధిచేసి చూపిస్తానని18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎదునూరి రమేష్ కోరారు.
స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని18వవార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి ఎదునూరి రమేష్ ఇంటింటా ప్రచారంనిర్వహించారు.కడియం శ్రీహరి, కడియం కావ్య ఆశీస్సులతో 18 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీముందుకు వస్తున్నానని ఆశీర్వదిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
అందరి అభిమానాలతో మీ ముందుకు వస్తున్నా నని ఆదరిస్తే మీలో ఒకడిగా పనిచేసి పెడతానని ఆయన అన్నారు. పేదవాళ్లకే సేవ చేయడం నా లక్ష్యం అని పేద కుటుంబంలో నుండి వచ్చానని పేదల కష్టాలు సుఖాలు తెలుసని ఆయన అన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యుడు యాకూబ్ పాషా,కందికొండ కుమారస్వామి, విన య్, శేషుబాబు, బిక్షపతి, సుందర్ సింగ్, ట్యాంక్ కిషోర్, రవి, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.