బిర్రు యాకయ్య కుటుంబానికి మిద్దెపాక రవీందర్ పరామర్శ

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 1(జర్నలిస్ట్ వార్త);
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ తండ్రి బిర్రు యాకయ్య ఇటీవల మృతి చెందగా, ఆదివారం నల్లబెల్లి గ్రామంలోని వారి నివాసానికి పలువురు నాయకులు విచ్చేశారు. మాస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మిద్దెపాక రవీందర్ యాకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాకయ్య మృతి వారి కుటుంబానికే కాకుండా గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. శోకసముద్రంలో 
 హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి యాకయ్య చిత్ర పటాన్నికి వాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 
సంకినేని సుధాకర్ రావు, జర్నలిస్ట్ నాయకులు బిర్రు కరుణాకర్, బిజెపి నాయకులు సతీష్ 
జిక్కి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.