గంధం పల్లి వారాంతపు సంతలో కల్తీ మటన్ దందా..!

journalist vaartha
By -

 బయ్యారం/జనవరి18(జర్నలిస్ట్ వార్త);
మండలంలోని గంధంపల్లి ఆదివారం వారాంతపు సంతలో కల్తీ మాంసం విక్రయాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపణలు వెలువడుతున్నాయి.దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోగాల బారిన బడిన గొర్రెలు, మేకలను కట్ చేసి కొంత మంది మాంసం అమ్మకం షాపులు వారు విక్రయాలను చేస్తున్నారు. మేకలను కోసి, గొర్రె పోతులమాంసంగా చిత్రీకరించి వాటి అవయవాలను మేక మాంసానికి కట్టి గొర్రె పోతుల మాంసం గా కిలో 800 నుంచి 1000 రూపాయలకు విక్రయాలు యదేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు మాంసం విక్రయదారులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు . మిగిలిన మాంసం ఫ్రిజ్లో పెట్టి, వారం తర్వాత మళ్లీ వారాంత సంతలోనే విక్రయాలకు పాల్పడుతున్నారు.దీనిని కట్టడి చేయవలసిన వెటర్నరీ అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో మాంసం విక్రయదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది.
 దీనితో మాంసం విక్రయదారులు పెద్ద ఎత్తున మోసాలకు గురి అవుతున్నట్లు తెలుపుతున్నారు. 
దీనిపై గంధంపల్లి వెటర్నరీ డాక్టర్ ముఖ్య లక్ష్మి వివరణ కోరగా మాకు పైనుంచి ఆదేశాలు లేవని ఆదేశాలు ఉంటే పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.