కేటీఆర్‌పై అక్రమ కేసులను బీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొంటుంది: కురుసపల్లి రమేష్

journalist vaartha
By -

ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో జనవరి 23 (జర్నలిస్ట్ వార్త):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కురుసపల్లి రమేష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో నిలదీస్తుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకుపాల్పడుతున్నారని ఆరోపించారు.ఇలాంటి అక్రమ కేసులను బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ధైర్యంగా, ధీటుగాఎదుర్కొంటుందని కురుసపల్లి రమేష్ స్పష్టం చేశారు.