,బయ్యారం/జనవరి18 (జర్నలిస్ట్ వార్త);
ఈ నెల 1న తాటిచెట్టు పై నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన బయ్యారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితె స్థానిక కాకతీయ నగర్ కు చెందిన ఆకుల కనకయ్య పుప్పాల బండ సమీపంలో తాడిచెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో గత డిసెంబర్ 31 న ప్రమాదవశత్తు క్రింద పడి తీవ్ర గాయాలు కావడంతో, గత 18 రోజులుగా ఖమ్మంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ,మనుమలు ఉన్నట్లు సమాచారం.