కాకతీయ మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత

journalist vaartha
By -
 ధర్మసాగర్/ జనవరి హనుమకొండ బ్యూరో 26(జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన రేమిడి మహేందర్ రెడ్డి రెడ్డి (59) మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.అవయవ దానం, మృతదేహ దానం ద్వారా అనేక మంది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని, సమాజానికి ఇది గొప్ప సేవగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రేమిడి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి ప్రేరణగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని మృతునికి నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనానికి వినియోగించేందుకు అధికారికంగా మెడికల్ కాలేజీకి అప్పగించారు.మానవ సేవే మహత్తర సేవ అన్న భావనను చాటిన ఈ ఘటన సమాజంలో విస్తృత స్పందనను రేకెత్తించింది.