తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గండికోట వెంకన్న నియామకం

journalist vaartha
By -
కాజీపేట/జనవరి 26(జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా కాజీపేట మండలానికి చెందిన గండికోట వెంకన్నను తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అల్లుమల్లు వెంకన్నకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గండికోట వెంకన్న మాట్లాడుతూ తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వడ్డెర కులాభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన గౌరవ అధ్యక్షులు పిట్ల మల్లేష్, రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు కంది రాజు, శివరాత్రి శంకర్ (మండల అధ్యక్షులు), శివరాత్రి కుమార్ (గ్రామ శాఖ అధ్యక్షులు)తో పాటు ఇతర ఒడ్డెర సంఘ నాయకులు పాల్గొన్నారు.