వర్ధన్నపేట/జనవరి 29 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపాలిటీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొమ్మటి స్వాతి గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులే తమను విజయపథంలో నడిపిస్తాయ ధీమా వ్యక్తం చేశారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల మధ్య ఆమె నామినేషన్ దాఖలు చేశారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని, ప్రజా సేవలో ముందుంటానని హామీ ఇచ్చారు.