నర్సంపేట/జనవరి 23 (జర్నలిస్ట్ వార్త):
ప్రజా ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష దృష్టి సారిస్తోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ క్లబ్‌లో 7 మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సాయంతో మొత్తం రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన ఆర్ధిక సహాయం పేదింటి యువతి పెళ్లి ఖర్చుకు అందజేయబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి, పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం మా ప్రభుత్వ బాధ్యత. ‘కళ్యాణ లక్ష్మి’ పథకం ద్వారా చెక్కులను ఎటువంటి దళారులకు ఇవ్వకుండా, నేరుగా పొందగలిగేలా చూడడం ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పోలం ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు.