సీఎం కప్ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు నిర్వహణ

journalist vaartha
By -

ధర్మసాగర్ /హనుమకొండ జిల్లా జనవరి 20 (జర్నలిస్ట్ వార్త):
సీఎం కప్–2026లో భాగంగా గ్రామస్థాయి, మండలస్థాయిల్లో నిర్వహించనున్న క్రీడా పోటీలకు గ్రామాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీల్లో గ్రామంలోని యువకులు, పిల్లలు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్, యోగ, చెస్, కరాటే వంటి క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.
అలాగే మండలస్థాయిలో గ్రామస్థాయి క్రీడలతో పాటు క్యారమ్, బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, జూడో, కిక్ బాక్సింగ్, నెట్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్, ఉషు, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్ లిఫ్టింగ్, స్కేటింగ్, సాఫ్ట్‌బాల్, టైక్వాండో, పారా గేమ్స్ వంటి పలు క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనదలచిన విద్యార్థులు, క్రీడాకారులు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కోసం
 https://satg.telangana.gov.in/cmcup/
లింక్‌ను ఉపయోగించాలని తెలిపారు.
సీఎం కప్ క్రీడల ద్వారా గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అధికారులు వివరించారు.