1వ వార్డులో ఇంటింట ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్నె బాబురావు

journalist vaartha
By -
 వర్ధన్నపేట /ఫిబ్రవరి5(జర్నలిస్ట్ వార్త);
 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరమైంది. 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం పాపారావు గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదిలారు. కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం పాపారావు గురువారం ఒకటో వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్నె బాబురావు, అంకేశ్వర్ రామచంద్రరావు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు 
వార్డు ప్రజలతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వార్డు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలను నాయకులు ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలంటే హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ప్రచారానికి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే పాపారావు గెలుపు ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.