కాంగ్రెస్ వన్ని నీతి మాటలు.. నీళ్ల మూటలు కాంగ్రెస్ నాయకులు కొత్తగా వేసిన శిలాఫలకాలు ఎక్కడైనా ఉన్నాయో...? రెడీమేడ్ రాజకీయం ఆపి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది. ఆరూరి చేసిందే చెబుతాడు ..చెప్పిందే చేస్తాడు.. టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మిద్దపాక రవీందర్..

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 5 (జర్నలిస్ట్ వార్త):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనేది అటకెక్కిందని, వారు చెబుతున్నవన్నీ కేవలం నీతి మాటలు, నీళ్ళ మూటలేనని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్ ఘాటుగా విమర్శించారు. గురువారం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో నేడు అభివృద్ధి అనే మాటే వినిపించడం లేదని, కాంగ్రెస్ నాయకులు కొత్తగా వేసిన శిలాఫలకాలు ఎక్కడైనా ఉన్నాయా అని భూతద్దం పట్టుకుని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారని, నేడు ఆ పనులనే కాంగ్రెస్ వారు తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రెడీమేడ్ రాజకీయం ఆపాలని, చేతనైతే కొత్త నిధులు తెచ్చి కొత్త పనులు ప్రారంభించాలని సవాల్ విసిరారు. అరూరి రమేష్ అంటే ఒక నమ్మకమని, ఆయన చేసిందే ప్రజలకు చెబుతారని, చెప్పిన ప్రతి మాటను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రతి గ్రామంలో, ప్రతి గడపకూ కళ్ళముందు కనిపిస్తున్నాయని, వాటిని చెరిపివేయడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. నీటి మీద రాతలు రాసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు, నిలువుటద్దం లాంటి నిజాన్ని దాచలేరని మండిపడ్డారు. అరూరి రమేష్ చేసిన అభివృద్ధి
నోసుటిపై గీతలలాటివని, చరిత్రను ఎవరూ తుడిచివేయలేరని అన్నారు. అబద్ధపు హామీలతో, మోసపూరిత మాటలతో ప్రజలను కొన్నాళ్లు నమ్మించవచ్చేమో కానీ, ఎల్లకాలం అది సాధ్యం కాదని రవీందర్ హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే ఈ రెడీమేడ్ రాజకీయాలకు చరమగీతం పాడుతారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికైనా విమర్శలు మానుకుని ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అరూరి రమేష్ వేసిన పునాదులపైనే నేడు నియోజకవర్గం నిలబడి ఉందని, ఆయన నాయకత్వంలోనే మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పాత కొత్త నాయకుల మధ్య విభేదాలు అలానే ఉన్నాయని. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి. ఎమ్మెల్యే నాగరాజు అధికారంలోకి రావడానికి తనకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను సైతం మరిచిపోయిన సంగతి తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవతలి వ్యక్తులపై బురదజల్లే రాజకీయం మానుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం దృష్టి సారించి. నీతి నిజాయితీగల రాజకీయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.