వర్ధన్నపేట/ఫిబ్రవరి7(జర్నలిస్ట్ వార్త); కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపే
లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి పొంగులేటి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని పేర్కొన్నారు. డీసీ తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న ఆయన, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు . మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని స్పష్టం చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గాని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానాని హామీ ఇచ్చారు. మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని, తండాలను గ్రామ పంచాయతీ గా చెయ్యడం ఖాయమన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ కాళి బొల్లి మాటలు నమ్మవద్దని, అభి వృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ,
మాజీ ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డీసీ తండా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.