మరణించిన మిత్రుడి కుటుంబానికి అండగా 2000-2001 బ్యాచ్ విద్యార్థులు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి8(జర్నలిస్ట్ వార్త);
 స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుండటమని నిరూపించారు నల్లబెల్లి జెడ్పీహెచ్ఎస్  2000-2001 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళ్తే
ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి రాజు ఈ నెల 30/01/2026న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మరణం కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన పాఠశాల మిత్రులు నల్లబెల్లి, ఉప్పరపల్లి, కొంకపాక గ్రామాలకు చెందిన వారు అందరూ ఏకమై, రాజు  పిల్లల భవిష్యత్తు కోసం తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మిత్రులందరూ కలిసి సేకరించిన 35 వేల రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పిల్లల చదువుకు ఈ మొత్తం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని వారు ఆకాంక్షించారు. చనిపోయిన మిత్రుడి పట్ల వారు చూపిన ఈ మానవత్వాన్ని స్థానికులు, గ్రామస్తులు ఎంతో అభినందిస్తున్నారు.
మిత్రుడు లేకపోయినా, అతని కుటుంబానికి మేమున్నాం అనే భరోసా కల్పించిన 2000-2001 బ్యాచ్ మిత్రులందరికీ మృతుని బంధువులు గ్రామస్తులు  అభినందనలు తెలిపారు.