రాయపర్తి(వర్ధన్నపేట)ఫిబ్రవరి 9(జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నేతావత్ షిభారాణి రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం 5వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, ప్రజలు ఆదరించి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా 5వ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు వార్డు ప్రజలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. వార్డు నిజమైన అభివృద్ధి జరగాలంటే ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయానని, అయినప్పటికీ ప్రజల సమస్యల పట్ల తన నిబద్ధత మారలేదని తెలిపారు. ఈసారి అవకాశం ఇస్తే ప్రజలకు అండగా నిలిచి, మౌలిక వసతులు పారిశుధ్యం,తాగునీరు,రోడ్లు వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాలోతు నరేష్, నేతావత్ బావ్ సింగ్, బానోత్ శ్రీనివాస్, మూడు ప్రవీణ్, భూక్య కిషన్, భూక్య రమేష్, నేతావత్ గణేష్, నేతావత్ రమేష్,మాలోతు బాలు,బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు
5వ వార్డు అభివృద్ధే నా లక్ష్యంఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నేతావత్ షిభారాణిరాజేందర్
By -
February 09, 2026