సాయిపేటకు అభివృద్ధి హామీగ్రామ సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి6 నెలల్లో పంచాయతీ భవనం, డ్రైనేజీ పూర్తి చేస్తాం

journalist vaartha
By -
ధర్మసాగర్/ ఫిబ్రవరి5 హనుమకొండ బ్యూరో(జర్నలిస్ట్ వార్త);ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించిన గ్రామ సభకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల నిమిత్తం వెళ్తున్న సమయంలో గ్రామ సభ జరుగుతున్న విషయం తెలుసుకుని సభలో పాల్గొనడం విశేషంగా మారింది. ఎమ్మెల్యే హాజరుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు, స్థానిక సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సర్పంచ్ ఎన్నికల అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న మొదటి గ్రామ సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు ప్రాధాన్యత క్రమంలో నిర్ణయించుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థలో ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే, తక్షణమే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం అవసరం అని అన్నారు. అలాగే గ్రామ ప్రధాన రహదారి వెంట డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని సూచించారు.
ఈ రెండు పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లక్ష్మి నాగరాజు గారికి ఆదేశించారు. ఆరు నెలల లోపే గ్రామ పంచాయతీ భవనం, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.గ్రామంలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి నాగరాజు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.